అమెరికా అబ్బాయి… పాలమూరు అమ్మాయి
అమెరికా అబ్బాయితో పాలమూరు అమ్మాయికి వివాహం జరిగింది. హైదరాబాద్‌లోని టూరిజం హోటల్లో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దగ్గరుండి నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వర్షిణి, అమెరికాలోని డల్లాస్‌కు చెందిన హేన్రిహుడ్గ్రీన్తో వివాహం జరిగింది. వీరిద్దరూ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అయితే వీరిదరూ ఒకరికొకరు ఇష్టపడటం, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో హిందూ సంప్రదాయ ప్రకారం వీరి పెళ్లి హైదరాబాద్‌లో జరిగింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నూతన వధూవరులను ఆశీర్వదించారు.













