తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ … మద్యం ప్రియులకు
మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లాక్డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరుచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు అబ్కారీ శాఖకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. అబ్కారీశాఖ నిబంధనల ప్రకారం బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు ఉదయం 10 గంటలలోపు తెరిచేందుకు అవకాశం లేదు. ఉదయం 10 గంటల తర్వాత లాక్డౌన్ నిబంధనలు అమల్లోకి వస్తాయి. దీంతో అబ్కారీశాఖ అధికారులు మద్యం దుకాణాలను తెరిచే అంశంపై ప్రభుత్వం నిర్ణయం కోసం వేచి చూడగా.. ప్రభుత్వం నిబంధనలను సడలించింది.













