మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల!
మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూలు వెలువడడంతో టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేయాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల అయిదో తేదీ దసరా రోజు తెలంగాణ భవన్లో జాతీయ పార్టీపై ప్రకటన అనంతరం.. సీఎం కేసీఆర్ మునుగోడు ఎన్నికపై నేతలతో సమావేశమవుతారు. అనంతరం పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటిస్తారు. జాతీయ పార్టీగా మార్పు కోరుతూ పార్టీ నేతలు ఈ నెల ఆరో తేదీన భారత ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పించనున్నారు. ఆమోదం పొందిన తర్వాత ప్రభాకర్‌రెడ్డికి జాతీయ పార్టీ పేరిట బీఫారం అందజేయాలని భావిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికను కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. అక్కడ గెలిచిన జాతీయ పార్టీగా బోణీ చేయాలని బీజేపీని ఓడిరచి సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు.













