ఆపాపం కేసీఆర్ దే : సీపీఐ

తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులకు, కృష్ణా పరివాహక ప్రాంతాలు ఎండిపోవడానికి పాపాల భైరవుడు కేసీఆర్ కారణమని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. గతంలో కేసీఆర్ చేసిన తప్పులతోనే తెలంగాణ రైతాంగం ఇబ్బందులు పడుతుందన్నారు. పంటనష్టానికి ఎకరానికి రూ.25వేలు డిమాండ్ చేస్తున్న మాజీ సీఎం కేసీఆర్ తన పాలనలో ఎంత ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో 2014 నుంచి 2018 వరకు పూర్తి స్థాయిలో కరువు ఉందన్నారు. ఆకాలంలో రూ.5వేల నుంచి 6 వేల కోట్ల వరకు పంటనష్టం జరిగిందని తెలిపారు.