సీఎం రేవంత్ రెడ్డికి.. కేటీఆర్ ఆల్ ది బెస్ట్

తెలంగాణకు భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా, దక్షిణ కొరియాల్లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో సీఎం విదేశీ పర్యటనపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డికి, మంత్రి శ్రీధర్ బాబుకు నా శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి విదేశాల్లోని ప్రముఖ కంపెనీలతో తాము పెంచుకున్న సంబంధాలు ఇప్పుడు రాష్ట్రానికి మేలు చేస్తున్నాయి. అలుపన్నది లేకుండా పట్టుదలతో రాష్ట్రానికి పెద్దఎత్తున విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చాం. వాటిని చూస్తుంటే నేడు రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రావడం సంతోషకరమని అన్నారు.