కేసిఆర్ పై కేటీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..

పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే 13 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు ఇద్దరు కొత్త అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఈసారి ఇచ్చిన రెండు స్థానాలు కూడా ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల ఖాతాలోకి వెళ్లాయి. మెదక్ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రాంరెడ్డి పోటీ చేస్తుండగా..నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగుతున్నారు. ఇద్దరు మాజీ సివిల్ సర్వెంట్లకు పింక్ పార్టీ లోక్సభ ఎంపీ టికెట్లు కేటాయించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తూ కేటీఆర్..ఆల్ ఇండియా మాజీ ఆఫీసర్లు కు తమ పార్టీ తరుపున ఎన్నికల బరిలో దించాలి అని భావించిన కేసీఆర్ గారికి అభినందనలు తెలియపరచారు. వీరిని ప్రజలు కచ్చితంగా గెలిపించి పార్లమెంటుకి పంపిస్తారు అంటూ కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం ఉన్న 17 పార్లమెంటు స్థానాలకు గాను బీఆర్ఎస్ ఇప్పటివరకు 13 స్థానాల అభ్యర్థుల పేర్లు ఖరారు మరొక నాలుగు స్థానాల అభ్యర్థుల ఎంపిక మిగిలి ఉంది వీటిలో కీలకమైన నల్గొండ, భువనగిరి స్థానాలు కూడా ఉన్నాయి.