ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో : మంత్రి కేటీఆర్
రాష్ట్ర ప్రయోజనాలను ఎప్పటికీ కాపాడేది టీఆర్ఎస్ మాత్రమేనని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో రూ.43 కోట్ల మేర అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానివి మాటలు తప్పా చేతలు కనిపించడం లేదన్నారు. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయాధారిత శుద్ధి పరిశ్రమలు తీసుకురానున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని, బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం, ప్రజల కోసం కేసీఆర్ కడుపులో ఉండే బాధ, కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఉంటుందా? ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలన్నారు. ఏనాటికైనా మన ఇంటి పార్టీయే ప్రజలకు శ్రీరామరక్షణ అవుతుందని, మన ప్రయోజనాలను కాపాడుతుందని అన్నారు.













