ఆయన లేకపోయుంటే నేడు దేశం… ఇలా ఉండేదా? : మంత్రి కోమటిరెడ్డి

దివంగత ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను తెలుగు జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పీవీ ఘాట్ లో మంత్రి సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ పార్టీ నేత అని చెప్పుకోవడాన్ని గర్వంగా భావిస్తున్నామని తెలిపారు. పీవీ నరసింహారావు సంస్కరణలు అమలు చేయకపోయుంటే దేశం ఇవాళ ఈ స్థితిలో ఉండేది కాదు. ఆయన మేధావి కాబట్టే అద్భుతమైన పాలన అంందిచారు. తెలుగుబిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహరావుకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నా అని కోమటిరెడ్డి తెలిపారు.