నేను అమెరికాలోనే ఉన్నా.. పరారీలో లేను
హైదరాబాద్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ అధీనంలోకి పుడ్డింగ్ అండ్ మిక్ పబ్‌లో జరిగిన రేవ్ పార్టీ కేసులో నిందితుడిగా ఉండి, ప్రస్తుతం పరారీలో ఉన్న కిరణ్ రాజు పెనుమత్స నుంచి పోలీసులకు ఈ మెయిల్ వచ్చింది. తాను సదరు పబ్‌లో భాగస్వామినని, పెట్టుబడి పెట్టాను తప్ప కార్యకలాపాలను పర్యవేక్షించట్లేదని తెలిపారు. తన సోదరికి ఆపరేషన్ కావడంతో కొన్ని నెలులుగా తాను అమెరికాలో ఉంటున్నానని పేర్కొన్నారు. పబ్‌పై దాడి జరిగిన తర్వాత తాను పారిపోయినట్లు మీడియాలో వస్తోందని, కానీ తాను పరారీలో లేనంటూ ఈ`మెయిల్లో వివరణ ఇచ్చారు. తాను హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత పోలీసుల ఎదుట హాజరై పూర్తి వివరణ ఇస్తానన్నారు. ఈ మెయిల్‌ను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు సాంకేతిక అంశాలపై ఆరా తీస్తున్నారు. ఏ ప్రాంతం నుంచి కిరణ్ దీన్ని పంపారో పరిశీలిస్తున్నారు.













