ఎవడు ఎన్ని ట్రిక్ లు చేసిన.. ఈసారి హ్యాట్రిక్ ఖాయం
ఖమ్మం జిల్లాలో డిపాజిట్లు రాని బీజేపీ, తెలంగాణలో అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటుందని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కర్ణాటకలో కషాయ పార్టీకి ఓటమి తప్పదని అమిత్ షా మాటలతో అర్థమైందన్నారు. ఎవడు ఎన్ని ట్రిక్‌లు చేసిన తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు తెలంగాణ కరువు కాటాకాలకు నిలయంగా ఉండేదని, నేడు కరువు అనే పదాన్ని డిక్షనరీ నుండి తొలగించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు కేసీఆర్ అండగా ఉంటారని తెలిపారు.













