యువ వ్యవసాయ శాస్త్రవేత్త మృతి

అంతులేని విషాదం …
ఊహించని నీటి ప్రవాహం ఆశల పల్లకిని మింగేసింది.
#వరదల్లో కొట్టుకుపోయిన యువ వ్యవసాయ శాస్త్రవేత్త #డాక్టర్ నునావత్ అశ్విని గారికి శ్రద్ధాంజలి!నివాళులు !!
భారీ వర్షాల కారణంగా తెలంగాణలో వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. మున్నేరు లాంటి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. రహదారులన్నీ జలమయమై వాగులన్నీ పొంగి పొర్లుతున్నాయి.కాగా చాలా విషాదకరమైన సంఘటనలో, ఖమ్మం జిల్లాకు చెందిన యువ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అశ్విని ప్రాణాలు కోల్పోయారు.
#ఊహించని నీటి ప్రవాహం ఆశల పల్లకిని మింగేసింది.గిరిజన వ్యవసాయ కుటుంబంలో జన్మించి వ్యవసాయ మెలుకువల్లో జాతీయస్థాయిలో సత్తా చాటి బంగారు పథకాలు పంట పండించింది. పుట్టిన ఊరుకు కన్న తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకురావడమే కాకుండా ఏందోరో యువ శాస్త్రవేత్తలను తీర్చిదిద్దాలి అనుకున్నా కాలం కనికరించలేదు.పూర్తి వివరాల్లోకి ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారం తండాకు చెందిన నునావత్ అశ్విని జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్లో ఢిల్లీలో యువ శాస్త్రవేత్త గా విధులు నిర్వహిస్తుంది.
#ఆమె తండ్రి మోతీలాల్ ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందినవాడు. అశ్విని ఇటీవల తన స్వస్థలంలో జరిగిన తన సోదరుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు.
#ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని ఐసీఏఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ మేనేజ్‌మెంట్ (ఎన్ఐబీఎం)లో జరగనున్న సదస్సులో పాల్గొనడానికి ఆమెకు ఆహ్వానం అందింది. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి రాయ్‌పూర్ వెళ్లాలని ఆమె ప్రణాళిక రూపొందించుకున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఆదివారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు తండ్రీకూతుళ్లు తమ కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమయ్య గూడెం వద్ద అడ్డంగా ఉన్న వంతెనపై ఆకేరువాగు పొంగి ప్రవహించడంతో కారు కొట్టుకుపోయింది.
#భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో విధులు నిర్వహిస్తున్న యువ శాస్త్రవేత నూనావత్ అశ్విని, అమె తండ్రి నునావత్ మోతీలాల్ ను ఆకెరువాగు బలితీసుకున్న ఘటన మండలంలోని ప్రతి ఒక్కరి కదిలిస్తుంది. తండ్రి కూతురు మృతితో గంగారం తండా యావత్తు శోకసముద్రంలో నిండి పోయింది. తండాలో చదువు ఆవశ్యకతను తెలియజేసి చదువు ఉంటేనే గుర్తింపు వస్తుందని,జీవితానికి సార్ధకత వస్తుందని, నిత్యం తోటి యువతకు భోదించే అశ్విని తమ కండ్లకు దూరం కావడం గ్రామ యువత జీర్ణించుకోలేక పోతుంది.
#ఉన్నత స్థాయికి ఎదుగుతున్న దశలో…
చిన్నతనంలో చదువులలో చురుకుగా ఉంటే నూనావత్ అశ్విని పదోతరగతి వరకు కారేపల్లిలోని బ్రిలియంట్స్ స్కూల్ చదువు అభ్యసించింది. ఇంటర్ బైపీసీని విజయవాడలోని ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో చదుకున్న ఆమె ఆశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసింది. పీజీని డిల్లీలో పూర్తి చేసిన అమె హైదరాబాద్‌లో పీహెచ్‌డీ చేశారు. ఇదే క్రమంలో అశ్విని జెనెటిక్స్ అంజ్ ప్లాంట్ బ్రీడిరగ్ లో శాస్త్రవేతగా ఎంపికై జాతీయ స్ధాయిలో ప్రథమ స్ధానంలో నిలిచింది. రాయపూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శాస్త్రవేతగా పని చేస్తుంది. వ్యవసాయ రంగంలో అశ్విని చేస్తున్న పరిశోధనలకు గాను ఈ ఏడాది ఏప్రిల్ 19,20,21 తేదిలలో రాయపూర్‌లో జరిగిన అంతర్జాతీయ 4వ అగ్రిమీట్‌లో ఉత్తమ యువశాస్త్రవేత అవార్డును పొందారు.
#సదస్సులో పాల్గొనడం కోసం బయల్దేరిన యువ సైంటిస్ట్.. వరదల కారణంగా ప్రాణాలు కోల్పోవడం పట్ల పలువురు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
#అనేక బీద గిరిజన బాల బాలికలకు స్ఫూర్తిని కలిగించి, శాస్త్రవేత్తగా ఉజ్వల భవిష్యత్తుతో ముందుకు సాగుతున్న డా. అశ్విని మరియు ఎంతో కష్టపడి తన కుమార్తె విద్యావేత్తగా ఉన్నత శిఖరాలను చేసుకోవాలని ఎన్నో కలలను కన్న ఆమె తండ్రి నునావత్ మోతీలాల్ అర్ధాంతరంగా ఇలా వరద ముంపులో ఆకస్మిక మృతి చెందడం అందరినీ కలచివేసింది.