సీఎం కేసీఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువులో చైత్రుశుద్ధ నవమి రోజు వైభవంగా జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కరోనా కారణంగా సామూహికంగా జరుపుకోలేక పోతున్నామని పేర్కొన్నారు. లోకకళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరం.. భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని ముఖ్యమంత్రి ప్రార్ధించారు. భద్రాచల పుణ్యక్షేత్రంలో పరిమిత సంఖ్యలో ఆలయ పూజారులు, అధికారుల ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న సీతారాముల కల్యాణాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా భక్తులు వీక్షించాలని సూచించారు.













