పార్టీ శ్రేణులు, అభిమానులకు కేసీఆర్ విజ్ఞప్తి… ఎవరూ రావొద్దు
తనను పరామర్శించేందుకు ఎవరూ యశోద ఆసుపత్రికి రావొద్దని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. 10 రోజుల వరకు నన్ను కలిసేందుకు ఎవరూ రావొద్దు. ఆసుపత్రిలో వందలాది మంది రోగులకు ఇబ్బంది కలగకూడదు. ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉన్నందున ఎవరూ రావొద్దని వైద్యులు చెప్పారు. నేను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ మధ్యకు వస్తా. కోలుకున్న తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరినీ కలుస్తా. నా పట్ల అభిమానం చూపుతున్న కోట్లాది ప్రజలకు కృతజ్ఞతలు. దయచేసి సహకరించండి అని పార్టీ శ్రేణులు, అభిమానులకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.













