తెలుగు మట్టివాసనకు దక్కిన గౌరవం ఇది : కేసీఆర్
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విశ్వ సినీ యవనికపై తెలుగు సినిమా సత్తా చాటింది. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం తెలుగువారికి గర్వకారణం. నాటు నాటు పాట తెలంగాణ సంస్కృతి, తెలుగు ప్రజల అభిరుచికి నిదర్శనం అన్నారు. తెలుగు మట్టి వాసనలను వెలుగులోకి తీసుకువచ్చిన చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి, చిత్ర దర్శకుడు రాజమౌళి, నటీనటులందరికీ కేసీఆర్ అభినందనలు తెలిపారు.













