కవిత మళ్లీ జైల్ కి.. బెయిల్ పిటిషన్ రిజర్వ్ కి..

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. మార్చి 15వ తారీఖున హైదరాబాద్ లోని ఆమె నివాసం నుంచి ఈడి అధికారులు కవితను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. కోర్టు అనుమతితో ఆమెను 10 రోజులపాటు ఈడీ కస్టడీలో ఉంచుకొని విచారణ జరిపారు. ఆ తర్వాత న్యాయస్థానం ఆమెకు జ్యూడిషియల్ రిమాండ్ ను విధించడంతో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఆమె తరఫున బెయిల్ కోసం తండ్రి కేసిఆర్.. అన్న కేటీఆర్ తెగ ఆరాట పడిపోతున్నారు. ఆమె కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఆమె బెయిల్ పిటిషన్ పై ఈరోజు కోర్టులో తమ వాదోపవాదాలు వినిపించారు. బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిసిన తర్వాత రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం నాడు కవిత బెయిల్ కు సంబంధించిన తీర్పు వెలువరించనున్నట్లు న్యాయమూర్తి తెలియజేశారు.