భారత్-అమెరికా సంబంధాలు బలోపేతం : క్యాథరిన్
భారతదేశ అభివృద్ధిలో సివిల్ సర్వెంట్స్ కీలకపాత్ర పోషించాలని అమెరికన్ కాన్సులేట్ జనరల్ క్యాథరీన్ బీ హడ్డా అన్నారు. మర్రిచెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో భారత్-అమెరికాల మధ్య గ్లోబల్ భాగస్వామ్యం అనే అంశంపై ఆమె మాట్లాడారు. ఇందులో 300 మంది ట్రైనీ సివిల్ సర్వెంట్స్ పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్నది కేవలం ద్వైపాక్షిక ఒప్పందం మాత్రమే కాదని, ప్రపంచ శాంతి, సామరస్యం కోసం చేస్తున్న కృషి ఉందన్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య క్యాథరిన్కు జ్ఞాపికను అందించారు.













