కాకతీయుల ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘కాకతీయ వైభవ సప్తాహం’ వేడుకల్లో భాగంగా కాకతీయుల విశిష్టతను తెలిపేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కాకతీయుల 22వ వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ తో కలిసి ప్రారంభించిన మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, కేటీఆర్.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణీదేవి, మేయర్ శ్రీమతి గద్వాల్ విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి, మానవీయ స్ఫూర్తికి మారుపేరుగా నిలిచిన కాకతీయ పాలకులను ఇప్పటికీ తెలంగాణ సమాజం గర్వంగా తలుచుకుంటుందని అన్నారు. కాకతీయుల స్ఫూర్తి తోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ పేరుతో రాష్ట్రంలోని చెరువుల పునురుద్ధరణ కార్యక్రమాన్ని మొదలు పెట్టిందని మంత్రి తెలిపారు.













