ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక నిర్ణయం

కాంగ్రెస్‌లో తాజా పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదనీ, ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదని వెల్లడించారు. తన ప్రమేయం లేకుండానే జరగాల్సిందంతా జరిగిందని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో తిరిగి ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. జగిత్యాల ఎమ్మెల్యే ఎం. సంజయ్‌కుమార్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడంతో జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయనను బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు.