Jashodaben: పాతబస్తీలో ప్రధాని మోదీ సతీమణి పర్యటన
ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) సతీమణి జశోదాబెన్ (Jashodaben) హైదరాబాద్ పాతబస్తీలో పర్యటిస్తున్నారు. చాందాయ్రణగుట్ట (Chandrayangutta) లోని పలు చారిత్రక ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన సోదరుడు అశోక్‌తో పాటు 18 మంది బంధువులతో కలసి ఆమె ఈ ఆధ్యాత్మిక పర్యటనకు రావడం విశేషం. చాంద్రాయణగుట్ట ఆర్‌ఎ్‌సఎస్ మైదానం సమీపంలో నివసించే బంధువులు మధుసింగ్, జ్యోతిధర్ సింగ్ నివాసానికి జశోదాబెన్ విచ్చేశారు. యాత్రలో భాగంగా బుధవారం పాతబస్తీలోని ప్రసిద్ధ ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్నారు. తొలుత శ్రీదేవి దే వాలయంలో అమ్మవారిని దర్శించుకుని, అనంతరం చాంద్రాయణగుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి దేవాలయం, శివాలయాన్ని ఆమె సందర్శించారు. న్యూ ఇందిరానగర్‌లోని శ్వేతగంగ, చాంద్రాయణగుట్టలోని జగన్నాథ స్వామి ఆలయాలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తన పర్యటనలో భాగంగా గురువారం చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం, లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవార్లను దర్శించుకోనున్నారు.






