సెప్టెంబర్ 12న వాషింగ్టన్ డీసీ సదస్సుకు కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎన్నారై వ్యవహారాలశాఖల మంత్రి కే తారకరామారావుకు మరో ప్రత్యేక ఆహ్వానం అందింది. యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ సారథ్యంలో నిర్వహించనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌లో ప్రసంగించాలని మంత్రి కేటీఆర్‌ను నిర్వాహకులు కోరారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో సెప్టెంబర్ 12న ఈ సదస్సు జరుగనున్నది. ఈ సమ్మిట్‌లో ప్రసంగించాలని కోరుతూ యూఎస్ ఇండియా బిజినెస్ లీగల్ పాలసీ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎమి హరియాని మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం పంపించారు. యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ లీగల్ పాలసీ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎమి హరియాని కేటీఆర్‌కు ఆహ్వానం పంపారు. సదస్సులో అమెరికా, ఇండియా మధ్య వ్యాపార వాణిజ్యం పెంపు అంశంపై చర్చించనున్నారు. రెండు దేశాల వ్యాపారాన్ని ప్రభావితం చేసే ఈ సమావేశంలో పాల్గొని అభిప్రాయాలను తెలపాల్సిందిగా కేటీఆర్‌ను కోరారు. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన కుమార్తె ఇవాంకాతో పాటు పలు దేశాల నేతలు ప్రసంగించనున్నారు.













