బ్రహ్మకుమారీ సంస్థ వార్షికోత్సవానికి సీఎం రేవంత్‌కు ఆహ్వానం

హైదరాబాద్‌లోని బ్రహ్మకుమారీ సంస్థ శాంతిసరోవర్ 20వ వార్షికోత్సవానికి హాజరుకావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బ్రహ్మకుమారీలు ఆహ్వానించారు. సచివాలయంలో సీఎంతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను కలిసి సంస్థ 20 ఏళ్ల ప్రస్థానాన్ని వివరించారు. ఆగస్టు మూడో వారంలో వార్షికోత్సవ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బ్రహ్మకుమారీల ప్రతినిధులు అంజలి, షీలా, వసంత, మాధవి, శ్రీలత తదితరులు ఉన్నారు.