అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన జస్టిస్ ఎన్.వి. రమణ
హైదరాబాద్లో అంతర్జాతీయ వాణిజ్య వివాదాల (ఆర్బిట్రేషన్) మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ప్రారంభించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్.వి. రమణ మాట్లాడుతూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపిందన్నారు. పెట్టుబడిదారులు తమ లిటిగేషన్ను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరుతున్నానని, ఆర్బిట్రేషణ్ సెంటర్ ఏర్పాటు వల్ల ఆ సమస్యలు తీరుతాయన్నారు. దుబాయ్లో ఇటీవల అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్లు ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు. మీడియేషన్ ఆర్బిట్రేషన్ సెంటర్ను ప్రోత్సాహించాలని అన్నారు. ఈ సెంటర్ వల్ల సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయన్నారు. సమయం కూడా చాలా ఆదా అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీతో పాటు మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.













