హైదరాబాద్ అబ్బాయి.. అమెరికా అమ్మాయి పెళ్లి

హైదరాబాద్ అబ్బాయి, అమెరికా అమ్మాయి పెళ్లి వేడుకలు నాగోలు స్వాగత్ గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో తెలుగు సంప్రదాయం ప్రకారం ఘనంగా జరిగాయి. నాగోలు లక్ష్మీనర్సింహ కాలనీకి చెందిన నారమళ్ల జీవన్ జ్యోతి- సుధాకర్‌రావు దంపతుల కుమారుడు రోహిత్ ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ ఉద్యోగం చేసే క్రమంలో అదే ప్రాంతంలో ఉపాధ్యాయురాలిగా పని చేసే రెబేకాతో ఏర్పడిన పరిచయం ప్రణయానికి దారి తీసి పరిణయానికి బాటలు వేసింది. రెబేకా తల్లిదండ్రులు లౌవురా` తియోతి అంగీకారంతో హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా వివాహం చేశారు.