బ్రిటిష్ పార్లమెంట్ లో తెలంగాణ సంస్కృతీ వైభవం
ప్రపంచంలో విభిన్న ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమైన విషయమని, అందుకోసం తమ సంస్కృతి సంస్థ చిత్తశుద్ధితో పనిచేస్తుందని యూకే మాజీ మంత్రి బరోనెస్ వర్మ అన్నారు. ప్రపంచ వారసత్వ సంపద వారోత్సవం సందర్భంగా బ్రిటన్ పార్లమెంట్లో భారత దేశంలోని విభిన్న ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని చాటే హస్తకళలకు సంబంధించిన వస్తువులు ఆకట్టుకున్నాయి. హౌస్ ఆఫ్ లార్డ్స్ఐలో జరిగిన చేనేత వస్త్రాలను అందరినీ ఆకట్టుకున్నాయి. యూకేకి చెందిన సేవా సంస్థ సంస్కృతి సెంటర్ ఫర్ కల్చరల్ ఎక్సలెన్స్ సంస్థ సారథ్యంలో, హోస్ట్ బరోనెస్ వర్మహస్త శిల్పం పేరిట నిర్వహించారు. బరోనెస్ వర్మ గతంలో మంత్రిగాను, ఐరాలో యూకే ప్రతినిధిగానూ పనిచేశారు. ప్రస్తుతం రిహాంప్టలన్ వర్సిటీ చాన్సలర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా తెంగాణ సంస్కృతిలో ఘనంగా చెప్పుకునే బోనాలు పండుగ ప్రత్యేకతను చాటేలా మహంకాలి అమ్మవారి కొలుస్తూ వనమాల అచ్చ వేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అలాగే పోచంపల్లి వస్త్ర వైభవాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. బ్రిటిష్ పార్లమెంట్లో ఈ తరహా కార్యక్రమం జరగడం ఇదే ప్రథమం. ఈ కార్యక్రమంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించిన కళాకారులను సంస్కృతి సెంటర్ వ్యవస్థాపక ట్రస్టీ రాగసుధ వింజమూరి సత్కరించారు.













