తెలంగాణకు హెచ్చరిక… రానున్న మూడు రోజులు
తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఈశన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసినట్లు తెలిపింది. రాగల 4 వారాల పాటు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాగల 3 రోజులు అతి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మోస్తరు నుంచి గట్టి జల్లులు పడే అవకాశం ఉంది. ఇప్పటికే సాధారణ వర్షపాతం కంటే అత్యధికంగా నమోదు అయిదని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్ జిల్లాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. వర్ష సూచన నేపథ్యంలో యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.













