గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో మెజారిటీ దిశగా టీఆర్ఎస్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగిస్తోంది. ప్రస్తుతం 51 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు 29 స్థానాల్లో గెలుపొందింది. తొలుత మెట్టుగూడలో టీఆర్ఎస్ అభ్యర్థి సునీత, యూసుఫ్‌గూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ పటేల్ గెలుపొందగా, ఆర్సీపురంలో టీఆర్ఎస్ అభ్యర్థి పుష్ప నగేశ్ విజయం సాధించారు.
జగద్గిరిగుట్టలో టీఆర్ఎస్ అభ్యర్థి జగన్, గాజులరామారంలో టీఆర్ఎస్ అభ్యర్థి రావుల శేషాగిరి, మల్లాపూర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సబిహా గౌసుద్దీన్, వివేకానంద నగర్ కాలనీలో టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం రోజా, కూకట్‌పల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి సత్యనారాయణ, శేరిలింగంపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్, పటాన్చెరులో టీఆర్ఎస్ అభ్యర్థి మెట్టు కుమార్ యాదవ్, అల్లాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి సబిహ బేగం, కేపీహెచ్బీలో టీఆర్ఎస్ అభ్యర్థి మందాడి శ్రీనివాస్ రావు, అల్లాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి సబిహ బేగం, కేపీహెచ్బీలో టీఆర్ఎస్ అభ్యర్థి మందాడి శ్రీనివాస్ రావు, అల్వాల్ లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చింతల విజయశాంతి, బాలాజీ నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి శిరీష బాబురావు, వెంకటాపురంలో టీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ కిశోర్, సూరారం డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి సత్యనారాయణ, కాప్రా డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి స్వర్ణరాజ్, హఫీజ్‌పేటలో టీఆర్ఎస్ అభ్యర్థి పూజితా జగదీశ్వర్ గౌడ్, కొండాపూర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి హమీద్ పటేల్, హైదర్‌నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నార్నె శ్రీనివాస్ రావు, భారతీ నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి సింధూ ఆదర్శ్ రెడ్డి, సనత్ నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మి, కుత్బుల్లాపూర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి పారిజాత గౌరీష్ గౌడ్, చింతల్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి రషీదా బేగం, బోరబండలో డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, బాలానగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఆవుల రవీందర్ రెడ్డి రంగారెడ్డి నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయ్ శేఖర్ ఘన విజయం సాధించారు.













