హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం…అందర్నీ ఒకేసారి బదిలీ
హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సైల నుంచి హోంగార్డుల వరకు అందర్నీ ఒకేసారి బదిలీ చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 85 మందిని బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీరిని సిటీ ఆర్మ్డ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసుల విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే సీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమచారం. బోధన్ మాజీ ఎమ్మెల్యే తనయుడి వ్యవహారంతో పాటు వివిధ కీలక విషయాలు బయటకి పొక్కడంపై సీపీ అగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పంజాగుట్ట పీఎస్కుకు కొత్తగా 82 మంది సిబ్బందిని నియమించారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బందిని ఇక్కడికి బదిలీ చేశారు.













