ఎల్ఆర్ఎస్ పై చర్యలు వద్దు

ఇళ్ల స్థలాలు, భవనాల క్రమబద్ధీకరణ అంశం ఎల్‍ఆర్‍ఎస్, బిఆర్‍ఎస్‍లపై దాఖలైన పిటిషన్లన్నింటిపైనా హైకోర్టు విచారిస్తూ, ఎల్‍ఆర్‍ఎస్‍పై విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్‍లో ఉందని రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో, ఎల్‍ఆర్‍ఎస్‍ను బలవంతంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఇచ్చే తీర్పు వరకు ఎల్‍ఆర్‍ఎస్ అమలు చేయొద్దని స్పష్టం చేసింది. సుప్రీంలో తేలే వరకు బిఆర్‍ఎస్ దరఖాస్తులపైనా తుది నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు కోరింది.