నాకు ఎలాంటి నోటీసులు రాలేదు : ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ మధ్యం కుంభకోణం వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తనకు నోటీసులు జారీ చేసినట్టు వచ్చిన వార్తలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందిచారు. తనకు ఎలాంటి నోటీసులూ రాలేదని స్పష్టం చేశారు. ఢిల్లీ లో కూర్చొని కొందరు దురుద్ధేశపూర్వకంగా మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. మీడియా సంస్థలు తమ సమయాన్ని నిజాల్ని చూపించేందుకు ఉపయోగించాలని కోరారు. టీవీ వీక్షకుల విలువైన సమయాన్ని ఆదా చేసేందుకు తనకెలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు. మీ సమయాన్ని వృథా చేసుకోకుండా, నిజాలను ప్రసారం చేయాలని అన్ని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నానని కవిత పేర్కొన్నారు.













