వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై పర్యటన
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వరంగల్, హనుమకొండ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత నగరానికి చేరుకున్న గవర్నర్ శ్రీభద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం హనుమకొండలోని హంటర్ రోడ్డులో వరద ముంపునకు గురైన ఎన్టీఆర్ నగర్, ఎన్.ఎన్.నగర్ ప్రాంతాల్లో బాధితులను పరామర్శించారు. రెడ్ క్రాస్ సొసైటీ సమకూర్చిన హెల్త్ కిట్స్, నిత్యావసరాలకు బాధితులకు గవర్నర్ పంపిణీ చేశారు. వరద బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సాయమందేలా చూస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా భద్రకాళి చెరువు కట్ట మరమ్మతు పనులను తమిళిసై పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ భారీ వరదలు జనజీవంపై తీవ్ర ప్రభావం చూపాయి. వరదలకు బెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. ఇలాంటి పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అని ఆన్నారు.













