మూడుసార్లు రావడం నా అదృష్టం : గవర్నర్ తమిళిసై
మేడారానికి గవర్నర్ హోదాలో మూడోసారి రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై అన్నారు. ఆమె కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండాతో కలిసి మేడారం మహాజాతరకు వచ్చారు. అమ్మవార్లకు ఎత్తు బంగారం సమర్పించారు. గద్దెల వద్దకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ గిరిజన ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు అమ్మవార్ల ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలను ఆదివాసీ, గిరిజన తెగలను నేను ఎంతో ప్రేమిస్తానని అన్నారు. రాష్ట్రంలోని ఆరు గిరిజన గ్రామాలను దత్తత తీసుకున్నానని అన్నారు.













