గవర్నర్ తమిళిసై స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొంటున్న భారతీయులకు, ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో త్యాగాలు చేసిన అమరులను స్మరించుకోవాల్సిన సందర్భమిదని ఆమె పేర్కొన్నారు. మెరుగైన భారత్‌ను నిర్మించడంలో అందరం నిబద్ధతను చాటుదామని, నాణ్యమైన విద్య, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ముందుకు సాగుదామని గవర్నర్ పిలుపునిచ్చారు. ప్రగతి స్ఫూర్తిని చాటేలా త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేయాలని తమిళిసై తెలిపారు.













