రాజ్ భవన్ లో ఘనంగా ఇఫ్తార్ విందు
రంజాన్ సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందు ఇచ్చారు. దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, తెలంగాణ ఉపముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభాపతి మధుసూదనాచారి, మంత్రులు పోచారం, కేటీఆర్, ఈటల, తుమ్మల, నాయిని, చందులాల్, సీఎల్పీ నేత జానారెడ్డి, మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ, సీఎస్ ఎస్పీ సింగ్, డీపీపీ అనురాగ్‌శర్మ, రోశయ్య తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌తో కలిసి గవర్నర్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. మహమూద్ అలీ, షబ్బీర్ అలీలకు గవర్నర్, సీఎంలు ఖర్జూర పళ్లు తినిపించారు. సీఎం కేసీఆర్ జానారెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం ఆయన రోశయ్యను కలిశారు. కేఈ కృష్ణమూర్తితో గవర్నర్, కేసీఆర్‌లు పలు అంశాలపై మాట్లాడారు. అనంతరం ముస్లిం ప్రముఖులతో కలిసి గవర్నర్, సీఎంలు విందు ఆరగించారు.













