హైదరాబాద్‌లో ఘనంగా జీటీఏ తొలి వార్షికోత్సవ వేడుకలు
హైదరాబాద్‌లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) తొలి వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్‌లోని మారియట్ హోటల్లో ఘనంగా జరిగాయి. ప్రవాస తెలంగాణ వాసులతో కలిపి ఏర్పాటుచేసిన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫోరం ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.బిజెపి నాయకుడు, ఎమ్మెల్యే బండి సంజయ్‌తో పాటు పలువురు ఎమ్మేల్యేలు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ శక్తివంతమైన భారత్‌ను నిర్మించడంలో జిటిఎ భాగస్వామం కావాలని కోరారు. వివిధ దేశాల్లోని తెలంగాణ వారందరిని ఒక్కచోటకు చేర్చుతున్న జిటిఎను ఆయన అభినందించారు. తనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు, ఎంతోమంది ఎన్నారైలు డబ్బు లేకపోయినా కష్టపడి పైకి వచ్చిన వాళ్లేనన్నారు. ఎక్కడో విదేశాల్లో ఉంటూ భారత్ అభ్యున్నతికి కృషి చేస్తున్న ఎన్నారైల సేవలు మరువలేనివన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి ఇతర దేశాల్లో చాటుతుంది తామేనని జీటీఏ ఫౌండర్, ఇండియా ఛైర్మన్ మల్లారెడ్డి తెలిపారు. ఎన్నారై తలుచుకుంటే.. ఒక రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా అభివృద్ధి చేసి చూపించగలడని ఆయన చెప్పారు. ఎన్నారైలు అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చి కుటుంబాన్ని కలిసే వాళ్లు మాత్రమే కాదని జీటీఏ నిరూపించిందని ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి అన్నారు. ఎన్నారైలు తలుచుకుంటే దేన్నైనా సాధించి చూపిస్తారని, వాళ్లను తక్కువ అంచనా వేయొద్దని తెలిపారు. ప్రపంచ దేశాల్లో ఉన్న మన తెలంగాణ ఎన్నారైలను చూసే అవకాశం మొదటిసారి ఈ వేదిక ద్వారా వచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి అన్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య అత్యధికంగా ఉంది. జిల్లా కేంద్రాల్లో ఉన్న నిరుద్యోగులకు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ తరఫున ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. ఇలాంటి వేదికలు తమకు స్ఫూర్తిగా ఉంటాయని ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అన్నారు. ఈ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మరింత విస్త్తరించాలని కోరారు. తమ మద్దతు జీటీఏకు ఉంటుందని ఎమ్మెల్యే మందుల సామెల్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇండియాకు చెందిన 150 మంది బోర్డు సభ్యులు హాజరయ్యారు. ఇండియాలో జీటీఏను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై మీటింగ్ నిర్వహించారు మల్లారెడ్డి. అనంతరం గ్రేట్ అండ్ మీట్ కార్యక్రమాన్ని ఇండియా ఛైర్మన్ మల్లారెడ్డి తోపాటు జీటీఏ అడ్వజర్ ఛైర్ రవీందర్ రెడ్డి, జీటీఏ అడ్వజర్ ఛైర్ డాక్టర్ విజయేందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, జే మీడియా అధినేత నరేందర్, ప్రతిప్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సమత, ఇతర బోర్డు సభ్యులు జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నృత్య, సాంస్కృతిక, పాటల కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.
ప్రపంచ దేశాల నుంచి జీటీఏ వేదికను పంచుకోవడానికి వచ్చిన వారిలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ వైస్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్ అభిషేక్ రెడ్డి, అడ్వజర్ ఛైర్ రవీందర్ రెడ్డి, అడ్వజర్ ఛైర్ ప్రమోద్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లు జే మీడియా అధినేత నరేందర్, ప్రతాప్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సమత, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు.. స్వామి, రాజగోపాల్, ప్రమోద్ కుమార్, జేడీ చక్రవర్తి, శ్రీవికాస్, డాక్టర్ చరణ్ జిత్, డాక్టర్ శోభాదేవి పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీ నుండి తిరుమల్ మునుకుంట్ల, రాము ముండ్రాతి, ప్రవీణ్ పల్రెడ్డి, సంపత్ దేశినేని, రామ్ మోహన్ రేగులపాటి పాల్గొన్నారు. వీరిలో ఎన్నారైలు, లాయర్లు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఈ గ్రీట్ అండ్ మీట్ లో జీటీఏ బోర్డు సభ్యులతోపాటు యోయో మీడియా సీఈవో నవీన్ రెడ్డి, చీఫ్ ఎడిటర్ స్వర్ణవిజిత, ప్రజాప్రతినిధులు బండిసంజయ్, యశశ్విని, పాయల్ శంకర్, రాకేష్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వేముల వీరేశం, భూపతి రెడ్డి, మదన్ మోహన్ రావు లు, ఎన్నారై రaాన్సీరెడ్డి, కొండారెడ్డి రవీందర్ రెడ్డి, అనిరుద్ రెడ్డి లతోపాటు వివిధ దేశాల వచ్చిన ఎన్నారైలు, నటులు రోహిత్ కుమార్, తెలంగాణ ఫోక్ సింగర్లు బిక్షునాయక్, గంగమ్మ, పారిజాతం తదితరులు పాల్గొన్నారు.
జీటీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ ఎన్నారైలు గ్రేట్ అండ్ మీట్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, నిర్వహణకు సహకరించిన స్పాన్సర్లకు జీటీఏ ఫౌండర్, ఇండియా ఛైర్మన్ మల్లారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.













