ఫిబ్రవరి 11న మేయర్ ఎన్నిక ?
డిసెంబర్ 1వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4వ తేదీన ఫలితాలు విడుదలయ్యాయి. అయితే, మేయర్ ఎంపిక ఇప్పటి వరకు జరగలేదు. మేయర్ ఎన్నికకు సంబంధించిన ఎన్నికల సంఘం ఓ ప్రకటన చేసింది. ఫిబ్రవరి 11వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ఉంటుందని ప్రకటించింది. కొత్తగా ఎన్నికైన సభ్యుల వివరాలను తెలంగాణ స్టేట్ గెజిట్లో ప్రచురిస్తామని తెలిపింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు ఎన్నికల సమయంలో చేసిన ఖర్చులకు సంబంధించిన వివరాలను ఎన్నికల సంఘానికి అందించాలని కోరింది. వివరాలు అందించని వ్యక్తులు భవిష్యత్తలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. గెజిట్లో జనవరి 11న వివరాలను ప్రచురించే అవకాశం ఉన్నది. జనవరి 11న గెజిట్ లో ప్రచురిస్తే, ఫిబ్రవరి 11న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. మరి మేయర్ పీఠం ఎవర్ని వరిస్తుందో తెలియాలంటే ఫిబ్రవరి 11 వరకు ఆగాల్సిందే.













