మా పార్టీకి, మా నేతకు ప్రత్యామ్నాయం లేదు
తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. షర్మిల పార్టీ ప్రత్యామ్నాయాలకు ఆయన చురకలంటించారు. టీఆర్ఎస్లో ఎలాంటి ధిక్కార స్వరాలు లేవని వివరణ ఇచ్చారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మా పార్టీ ఉన్నన్ని రోజులూ వేరే పార్టీ మనుగడ సాధించలేదు. మా పార్టీకి, మా నేత కేసీఆర్కు ప్రత్యామ్నాయం లేదు, రాదు. ప్రజలందరూ కేసీఆర్ను కోరుకుంటున్నారు. ప్రస్తుతం సంతోషంగా ఉన్న ప్రజలు వేరే శక్తులొచ్చి ఫ్యాక్షనిజం చేస్తామంటే ఒప్పుకోరు అని అన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ల బిల్లు తేవాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు కల్పించట్లేదని ప్రశ్నించారు. కులాల ఆధారంగా జనాభా గణన జరగాలన్నారు. ఎంబీసీ అంటే బీజేపీ నేతలకు తెలుసా? అని ఎద్దేవా చేశారు. ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.













