ఇద్దరు ఇండో-అమెరికన్ విద్యార్థుల కృషి.. తెలంగాణలో మెగా మెడికల్ క్యాంప్ విజయవంతం!

అమెరికాలోని కాలిఫోర్నియాలో చదువుకుంటున్న ఇద్దరు భారతీయ విద్యార్థులు.. సువిధ వికాస్ ట్రస్ట్, జాగృతి ఎన్జీవోతో కలిసి తెలంగాణలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య సదుపాయాలకు దూరంగా ఉంటున్న వారి వద్దకు వైద్యాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరా మండలంలోని అష్టనగుర్తి గ్రామంలో ఎం.పి. ప్రైమరీ స్కూల్‌లో ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ విషయం తెలిసిన వందలాది మంది ఈ మెడికల్ క్యాంప్‌కు వచ్చి తమ అనారోగ్య సమస్యలకు పరీక్షలు చేయించుకున్నారు. మెడికల్ క్యాంపులో పేషెంట్లకు వైద్య సదుపాయాలు అందించడంతోపాటు ఉచితంగా మెడిసిన్స్ కూడా అందించారు. ఇక్కడ వైద్యం చేయించుకున్న 400 మందికి పైగా పేషెంట్లు అందరూ కూడా క్యాంప్ పనితీరు, డాక్టర్ల స్నేహభావానికి చేతులెత్తి మొక్కారు.
కాలిఫోర్నియాలోని గ్రానైట్ బే హైస్కూల్‌లో చదువుకుంటున్న అభిరామ్ ధూలిపాళ్ల, శ్రీరామ్ వేంపటి.. పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే ఆలోచనతో కాలిఫోర్నియాలోని సువిధా ఇంటర్నేషనల్ ఫౌండేషన్, అష్టనగుర్తి గ్రామంలోని సువిధ వికాస్ ట్రస్ట్‌ను సంప్రదించారు. అక్కడితో ఆగకుండా ఈ విద్యార్థులిద్దరూ క్యాంప్ ప్లానింగ్‌లో పాలుపంచుకోవడం, వైద్యులతోపాటు పేషెంట్లతో కూడా కలిసి పనిచేయడం ఎంతో అభినందనీయం. అంతకుముందు కూడా అభిరామ్, శ్రీరామ్ ఇద్దరూ ఖమ్మంలోని గవర్నమెంట్ హాస్పిటల్‌లో వాలంటరీ వర్క్ కూడా చేశారు. జులై 21న ఈ మెడికల్ క్యాంప్‌రె పెవిధ వికాస్ ట్రస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులైన అమరనేని మన్మధ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నారగాని రామ్‌ప్రసాద రావు, డాక్టర్ కొల్లి అనుదీప్, డాక్టర్ వాసిరెడ్డి నిర్మల, డాక్టర్ జనగాల గోపీ కృష్ణ, డాక్టర్ జయ బాబు, డాక్టర్ హారిక, ఎం. నరసింహరావు, ఎం. కుముదిని, ఇ. మాధవి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.