పటాన్ చెరులో ఎస్ఎంటీ స్టెంట్ తయారీ యూనిట్ కు భూమిపూజ
దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు పెట్టడానికి అనువైన రాష్ట్రం తెలంగాణ , అనువైన నగరం హైదరాబాద్ అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు । అనువైన భూమి, నిరంతర కరెంటు, సులభతర అనుమతులు, నీటి కేటాయింపులు, మౌలిక సదుపాయాలు, నైపుణ్య, ఇతర ఉద్యోగులు , అతి చౌకగా దొరికే పని వాళ్ళ లభ్యత , పక్కాగా శాంతి భద్రతలు వంటి అంశాలు పారిశ్రామికవేత్తలను తెలంగాణ వైపు ఆకర్షింపజేయడానికి ప్రధాన కారణమన్నారు। ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు , గత ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ కార్యాచరణ సత్ఫలితాలు ఇస్తున్న కారణంగానే పారిశ్రామికాభివృద్ధి లో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు।
ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం సుల్తాన్పూర్ టీఎస్ ఐఐసీ మెడికల్ డివైస్ పార్కులో ౨౦ ఎకరాలలో సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ సంస్థ నెలకొల్పే స్టెంట్ తయారీ యూనిట్ కు భూమి పూజ కార్యక్రమంలో వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ , కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు చేతుల మీదుగా శంకుస్థాపన చేసారు । ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి , పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి , ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి , పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజాన్ , టీఎస్ ఐఐసీ ఎండి నర్సింహా రెడ్డి , సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంత రావు , జడ్పి వైస్ చైర్మన్ ప్రభాకర్ , సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ చైర్మన్ ధీరజ్ లాల్ కొటారియా, ఎండి భార్గవ కొటారియా, వైస్ ప్రసిడెంట్ రాజీవ్ చిబ్బర్, సంస్థ ప్రతినిధులు బల్విందర్ సింగ్ , శ్రీనివాస్ రెడ్డి , స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు । ఈ సందర్బంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ।। గుండె ఆపరేషన్ కు వినియోగించే స్టెంట్ తయారు చేసే కంపెనీ తెలంగాణాలో ఏర్పాటు కానుండటం మనందరికీ గర్వకారణమన్నారు। ముఖ్యమంత్రి కేసీఆర్, గత పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషి వల్లే ఆసియా ఖండంలో అతి పెద్ద స్టెంట్ తయారీ కంపెనీ రాష్ట్రానికి వచ్చినందన్నారు ।
దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు పెట్టడానికి అనువైన రాష్ట్రము తెలంగాణ , అనువైన నగరంగా హైదరాబాద్ ఖ్యాతిని గడించిందన్నారు । నిన్న ఫార్మా ఇండస్ట్రీస్, ఐ టి ఇండస్ట్రిస్ లో కావచ్చు ఇవాళ మెడికల్ డివైసెస్ , ఇతర ఇండస్ట్రీస్ ను నెలకొల్పే విషయంలో ఇవాళ పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ వైపు చూస్తున్నారని చెప్పారు । దీనికి కారణం తెలంగాణాలో పక్కాగా శాంతి భద్రత లు ఉండటమేనని , తనకు తెలిసినంత వరకు తెలంగాణ రాష్ట్రములో ఉన్నంత లా అండ్ ఆర్డర్ దేశంలో మరెక్కడా లేదన్నారు । ఒకప్పుడు అభివృద్ధి అంటే గుజరాత్ అని వినేవాళ్ళం కానీ ఇవాలా అభివృద్ధి అంటే తెలంగాణ, హైదరాబాద్ మాత్రమేనని రాజేందర్ అన్నారు . ౨౪ గంటలు కరెంటు ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రమేనని , ఇక్కడ ఒక్క పరిశ్రమలకు మాత్రమే కాదు వ్యవసాయ , డొమెస్టిక్ రంగాలకు కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు సరఫరా జరుగుతుందని చెప్పారు.
ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో వారానికి నాలుగు రోజులు పరిశ్రమలకు కరెంటు సరఫరా చేయాలనీ పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్కు ధర్నా చౌక్ లో ఆందోళనకు దిగిన దారుణ పరిస్థితులు ఉండేవన్నారు . కరెంటు సరఫరా లేక పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడుతున్నారని చివరకు యూనిటు కు ౧౧ రూపాయలకు అయినా సరే మాకు కావసిన కరెంటును ఇవ్వాలని వాళ్ళు పరిశ్రమలకు కాలేంటూ ఇవ్వక నాటి పాలకులు చేతులు ఎత్తేశారని గుర్తు చేసారు . మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు ఇరవై నాలుగు గంటల పాటు కరెంటును అందిస్తున్నందు వల్లే పరిశ్రమలు అభివృద్ధి బాట పట్టాయన్నారు . అనువైన భూమి , నిరంతర కరెంటు, సులభతర అనుమతులు , అవసరాల మేరకు నీటి కేటాయింపులు, పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాలైన మౌలిక సదుపాయాలు, అందుబాటులో నైపుణ్య, ఇతర ఉద్యోగులు , అతి చౌకగా దొరికే పని వాళ్ళు, పక్కాగా శాంతి భద్రతలు పారిశ్రామికవేత్తలను తెలంగాణ వైపు ఆకర్షింపజేయడానికి ప్రధాన కారణమన్నారు పారిశ్రామికంగా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రగతిశీల విధాన ఫలితంగానే గుజరాత్ , మహారాష్ట్ర నుండి కూడా పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రముకు వస్తుండటం మనకు గొప్ప విజయం అన్నారు . తెలంగాణకు పరిశ్రమలు పెద్ద ఎత్తున తరలి రావడానికి ప్రభుత్వ నూతన పారిశ్రామిక విధానమే మరో కారణం మన్నారు.
గతంలో పరిశ్రమలకు అనుమతుల కోసం రెండు మూడేళ్లు అధికారుల చుట్టూ తిరగాల్సి దుస్థితి ఎదురయ్యేదని , ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సింగిల్ విండో పద్దతిలో ఎవరి దగ్గరికి తిరగకుండా , ఎవ్వరికి డబ్బులు ఇవ్వకుండా , పారదర్శకంగా కేవలం ౧౫ రోజుల్లోపే పరిశ్రమలకు అన్నిరకాల అనుమతులు ఇస్తున్న రాష్ట్రము దేశంలో తెలంగాణ ఒక్కటే నని మంత్రి ఈటెల తెలిపారు . ఒకవేళ అధికారులు ౧౫ రోజుల్లో అనుమతులు ఇవ్వకపోతే డీమ్డ్ టు పర్మిట్ ఉత్తర్వులను ఇస్తున్న రాష్ట్రము కూడా తెలంగాణ ఒక్కటేనన్నారు । తెలంగాణాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకువచ్చే పారిశ్రామికవేత్తలకు , కంపెనీలకు ప్రభుత్వం టీఎస్ ఐఐసీ ద్వారా తక్కువ ధరలకు భూములు కేటాయిస్తుందన్నారు । నగర శివారు ప్రాంతాల్లో ఖరీదైన భూములను సైతం పరిశ్రమలకు తక్కువ ధరకు కేటాయించడం వెనుక హైదరాబాద్ ను దేశంలోనే ఒక గొప్ప నగరంగా అభివృద్ధి చెందాలని , ఆమేరకు ఆయా ప్రాంతాల రెవిన్యూ కూడా పెద్ద ఎత్తున వృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు । దేశంలో మొట్టమొదటిసారిగా పరిశ్రమలకు కాళేశ్వరం , ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టుల నుండి సర్ఫేజ్ ద్వారా నీటిని అందజేస్తున్న ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు । బావులు , బోర్ల ద్వారా పరిశ్రమలకు నీటి వాడకం వల్ల యాజమాన్యాలపై పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్నందున పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా ప్రజలకు తాగునీటిని అందించే మిషన్ భగీరథ పథకం ద్వారానే పరిశ్రమల కూడా భవిష్యత్ అవసరాలకు సరిపడేలా ప్రభుత్వం ౧౦ శాతం నీటి కేటాయింపులు చేసిన రాష్ట్రము తెలంగాణ ఒక్కటేనని చెప్పారు ।
హైదేరాబద్ ఇప్పటికే ఎడ్యుకేషన్ హబ్ , ఐ టి హబ్ గా అభివృద్ధి చెందినందున టెక్నికల్ పర్సన్స్ కు కొరత లేదని , విద్యార్హతల మేరకు స్థానికులకు ఉద్యోగావకాశాల్లో ప్రాధాన్యత కల్పిస్తూ వృత్తి నైపుణ్యత కోసం వారికి పరిశ్రమల యాజమాన్యాలు ఆసరమైన శిక్షణ ఇవ్వాలని , ఈ విషయంలో ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు శాస్త్ర , సాంకేతికత ఎంత పెరిగినా నేటికీ కొత్త రకమైన సమస్యలు సవాలుగా మారుతున్నాయన్నారు । వైద్యం కోసం పెట్టె ఖర్చులు ఉహించనివని, బంగళాలో ఉన్న వాడైనా, గుడిసెలో ఉన్న వాడైనా గుండె ఆపరేషన్ స్టెంట్ కోసం యాభై , అరవై వేల రూపాయలు భరించాల్సిందేనని, కానీ క్యాన్సర్ , గుండె నొప్పి లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు సోకి నపుడు ఖరీదైన వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేక నిరుపేదలు నిస్సహాయులుగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు ఈ పరిస్థితి పోయి పేదలకు చౌకగా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేలా శాస్త్ర , సాంకేతికత రంగంలో విస్తృత ఇంకా పరిశోధనలు జరగాలని , ఈ దిశగా సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ యాజమాన్యం కృషి చేయాలనీ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు మావొళ్ళు ఒక్కటే కోరుకుంటారు మీరు చల్లగా జీవించండి మీరు గొప్పగా ఎదగండి మీ ఎదుగుదలలో మా స్థానిక ప్రజల బతుకులను చూడామణి కోరిక ఉంటది తప్ప వాళ్ళ ఎదుగుదల చూసి ఈర్ష్య పడే ప్రాంతం తెలంగాణ కాదు । మా వాళ్ళు ఎప్పుడు అడిగినా ఉపాధి , ఉద్యోగాలు అడుగుతారు। అన్నింటా ఆడుకుంటారు కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టరని , ఉద్యోగాలు మాత్రం కోరుకుంటారు అందుకు తగిన విధంగా వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కంపెనీ యాజమాన్యానికి మనవి చేస్తున్నా అని మంత్రి రాజేందర్ సూచించారు.
తెలంగాణ ప్రజలకు తక్కువ ధరకు స్టెంట్లు ఇవ్వండి – టీఎస్ ఐఐసీ చైర్మన్ బాలమల్లు
ఆసియా ఖండంలోనే అతి పెద్ద ప్రతిష్టాత్మకమైన స్టెంట్స్ తయారీ యూనిట్ ను తెలంగాణాలో నెలకొల్పేందుకు సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ సంస్థ ముందుకు రావడం హర్షణీయమని టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు. కంపెనీ స్థాపనకు అనువైన భూములను ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తున్నందున ఇక్కడ తయారు చేసే స్టెంట్లన్లు తెలంగాణ ప్రజలకు మిగతా రాష్ట్రాల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉండేలా చూడాలని ఎస్ ఎం టి కంపెనీ యజమాన్యానాన్ని కోరారు . సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన విప్లవాత్మకమైన విధానాల ఫలితంగానే నేడు తెలంగాణ పారిశ్రామికంగా దేశంలోనే నెంబర్ వన్ స్థానములో ఉందన్నారు . గత ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ ఎంతోముందు చూపుతో సుల్తాన్పూర్లో దాదాపు ౨౫౦ ఎకరాల్లో మెడికల్ డివైసెస్ పార్కును అన్నిరకాల మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు . ఫలితంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే చాల వైద్య పరికరాల తయారీ కంపెనీలు భూములు కొనుగోలు చేసి యూనిట్ల స్థాపనకు నిర్మాణ పనులు మొదలు పెటాయనని చెప్పారు .ఇక్కడే మరో ౫౦ ఎకరాలను మహిళా పారిశ్రామికవేత్తలకు కేటాయించామని, త్వరలో వారు కూడా పరిశ్రమల నిర్మాణ పనులను మొదలు పెడతారని టీఎస్ ఐఐసీ చైర్మన్ తెలిపారు . మెడికల్ డివైసెస్ పార్కులో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తల పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారని, దీంతో ఇక్కడే మరో ౩౦౦ ఎకరాలను సేకరించే చర్యలు మొదలయ్యాయని బాలమల్లు చెప్పారు.













