బీజేపీకి షాక్ …కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ వివేక్
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి షాక్ తగిలింది. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్‌లో చేరారు. శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో వివేక్, ఆయన కుమారుడు వంశీ కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ను గద్దె దింపే శక్తి కాంగ్రెస్‌కు ఉందని వివేక్ నమ్మారని, ఆయన చేరికతో తమ పార్టీకి వెయ్యి ఏనుగుల బలం వచ్చిందన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. వివేక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీఆర్ఎస్ నెరవేర్చలేకపోయిందన్నారు. కేసీఆర్ కుటుంబం వారి ఆకాంక్షల మేరకే పనిచేస్తోందని ఆరోపించారు. కేసీఆర్‌ను గద్దె దింపాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ చేరినట్లు తెలిపారు. టికెట్ అనేది అంత ముఖ్యమైన విషయం కాదని అన్నారు.













