రాబోయేవి మన రోజులే.. ఎవరు అధైర్య పడొద్దు
పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. ములుగు జిల్లా వాజేడులో ఆయన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో మనం పని చేయాల్సిన అవసరం ఉందని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అనుచరులకు ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాల్లో ఒడి దుడుగులు సహజం. రాబోయేవి మన రోజులే. ఎవరు అధైర్య పడొద్దు. ఆందోళన చెందవద్దని అన్నారు. 40 ఏళ్లు రాజకీయంగా ఏ విధంగా ఉన్నానో రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా ఉంటాను. ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వేల కోట్లు ఇచ్చారు. మనకు మేలు చేసే వ్యక్తులను మనం ఆదరించాలి. తాత్కాలిక అవసరాల కోసం నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు వస్తాయి అని అన్నారు.













