ఎన్ఆర్ఐ సెల్ కోర్ కమిటీ సభ్యునిగా చంద్రశేఖర్ రెడ్డి
అమెరికాలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎన్ఆర్ఐ సెల్ కోర్ కమిటీ కార్యవర్గంలో మక్తల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ సందర్భంగా అమెరికాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత నాలుగు రోజులు క్రితం అమెరికాలో అన్ని రాష్ట్రాలకు సమన్వయం చేసుకోవడానికి 9 మందితో కూడిన కోర్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ పీసీసీ కోర్ కమిటీలో స్థానం కల్పించడంతో పాటు సౌత్ సెంట్రల్ జోన్ ఇంచార్జిగా నియమించినట్లు తెలిపారు. టెక్సాస్, లూసియానా, ఓక్ల హోమా, న్యూ మెక్సికో రాష్ట్రాలకు సౌత్ సెంట్రల్ జైలు ఇంచార్జిగా నియమించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. తమపై పెట్టిన బాధ్యతను నిస్వార్థంగా నిర్వర్తిస్తానని, కాంగ్రెస్ పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.













