ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు
రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని తెలంగాణ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. నీళ్ల విషయంలో రాష్ట్రానికి శాశ్వత ప్రయోజనాలు కలగాలని ఆకాంక్షించారు. కృష్ణా జలాల కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాడలేదనేది అవాస్తవం. ప్రాజెక్టుల అప్పగింతకు తెలుగు రాష్ట్రాలు ఒప్పకున్నాయని కేంద్రం చెబుతోంది. ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ నిర్వహిస్తే, రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. హామీలను అమలు చేయలేని స్థితిలో కాంగ్రెస్ ఉంది. బీఆర్ఎస్పై నెపం పెట్టి తప్పించుకోవాలని చూస్తోంది అని విమర్శించారు.













