టీఆర్ఎస్ కు మరో షాక్..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల నుంచి ఇంకా కోలుకోక మునుపే అధికార టీఆర్ఎస్ పార్టీకి మరో ఊహించని షాక్ తగిలింది. తాజాగా జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రత్యామ్నాయాలు వెదుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లాల్లో టీఆర్ఎస్కు ఊహించిన షాక్ తలిగింది. మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని మంత్రి గంగుల కమలాకర్‌కు పంపించారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను రమేష్ కలిశారు. త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్పొటరేగా రమేష్ భార్య విజయం సాధించారు.













