బీజేపీలో ఈటల చేరికకు.. ముహూర్తం ఖరారు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. ఇందుకు సంబంధించిన మూహుర్తం ఖరారైంది. ఈ నెల 14న ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజీపీ కండువా కప్పుకోనున్నారు. ఈటల రాజేందర్ తోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ కూడా కాషాయం తీర్థం పుచ్చుకోనున్నారు.