టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్.. కేంద్ర ఎన్నికల సంఘం
తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ ఏడాది దసరా పర్వదినం రోజున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ తరపున లేఖ రాసిన విషయం విదితమే. ఎట్టకేలకు కేసీఆర్ రాసిన లేఖపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. పార్టీ మార్పునకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కేసీఆర్కు అధికారికంగా లేఖ అందింది. దీంతో పార్టీ నాయకులు, శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.













