సీఎం రేవంత్‌కు షాకిచ్చిన ఈసీ.. నోటీస్ జారీ

లోక్‌సభ ఎన్నికలకు సరిగ్గా మూడు రోజుల ముందు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల కమిషన్ ఊహించని షాకిచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషించినందుకు, అసభ్యపదజాలం వాడినందుకు గానూ రేవంత్ రెడ్డికి శుక్రవారం ఈసీ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వీటిపై వివరణ ఇవ్వాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని సదరు నోటీసుల్లో పేర్కొంది.
ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌పై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలకు దిగారు. రైతుబంధు సాయం, రైతురుణమాఫీ విషయంలో ప్రభుత్వంపై కేసీఆర్ చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టే క్రమంలో రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. ‘కేసీఆర్ మతి ఉండి మాట్లాడుతుండో.. మందు వేసి మాట్లాడుతుండో తెలియట్లేదు.’ అని వ్యక్తిగత ఆరోపణలు చేస్తూనే దూషణలకు కూడా దిగారు. దీంతో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ నేతలు.. నేరుగా ఈసీకి ఫిర్యాదు చేశారు. రేవంత్ వ్యక్తిగత దూషణలకు దిగుతూ తమ నాయకుడి ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన ఈసీ.. రేవంత్ వ్యక్తిగత దూషణలకు దిగారని నిర్ధారించింది. అనంతరం ఆయనకు నోటీసులు జారీ చేసి 12వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.