దుబ్బాకలో మళ్లీ టీఆర్ఎస్ జోరు…
దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పక్రియ ఉత్కంఠగా మారింది. హోరాహోరీ పోటీ నెలకొంది. మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చివరి రౌండ్లలో చతికిల పడిపోయింది. తొలి ఐదు రౌండ్లు, 8, 9, 11 రౌండ్లలో బీజేపీ మోజార్జీ సాధించగా, టీఆర్ఎస్ పార్టీ 6, 7, 13, 14, 15, 16 రౌండ్లలో భారీ మెజార్టీగా దిశగా దూసుకెళ్లింది. 15, 16 రౌండ్లలో 1500 మెజార్టీ సాధించి. విజయం దిశగా వెళ్తుంది. 15వ రౌండ్లో 955 ఓట్ల మెజార్టీ సాధించగా, 16వ రౌండ్లో 749 ఓట్లు సాధించింది టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కేవలం 12వ రౌండ్లో ఆధిక్యం సాధించింది. 16 రౌండ్లు ముగిసేసరికి బీజేపీకి 1700 ఓట్ల మెజార్టీ మాత్రమే ఉంది. 17వ రౌండ్లో టీఆర్ఎస్కు 2818, బీజేపీ 1946, కాంగ్రెస్ 1705 ఓట్లు లభించాయి. 18వ రౌండ్లో టీఆర్ఎస్ 3215, బీజేపీకి 2527, కాంగ్రెస్ 852 కోట్లు లభించాయి. 18వ రౌండ్లో ముగిసేసరికి బీజేపీ 174 ఓట్ల స్వల్ప ఆధిక్వంలో ఉంది. 19వ రౌండ్లో టీఆర్ఎస్ 425 ఓట్ల ఆధిక్యం ప్రదర్శించింది. మొత్తం 19 రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత 251 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.













