తెలంగాణలో 70 పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య అదివారానికి 70కి చేరినట్టు వైద్య విభాగాల ద్వారా తెలిపింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో ఒకరు గతంలోనే డిశ్చార్జ్ కాగా, తాజాగా 11 మందికి కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఐసొలేషన్‌లో ఉన్న ఈ 11 మందిలో ఇండోనేషియాకు చెందిన 9 మంది, రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఉన్నారు. వీరిని సోమవారం డిశ్చార్జ్ చేయనున్నారు. మిగిలిన 58 మంది గాంధీ, ఛాతి దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు 76 ఏండ్ల వృద్ధుడి పరిస్థితి కొంత ఇబ్బందిగా ఉన్నట్టు సమాచారం.













