ఆ హామీ అమలు చేయడం కోసం… దృఢ సంకల్పంతో ఉన్నాం : డిప్యూటీ సీఎం భట్టి

వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఖమ్మం కలెక్టరేట్‌లో నిర్వహించిన రైతు భరోసా పథకం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అందజేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హామీని అమలు చేయడం కోసం తమ ప్రజా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనందున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిందన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని తెలిపారు. రైతు భరోసా పథకం అమలు కోసం ఉమ్మడి పది జిల్లాలో పర్యటించి ప్రజలు, రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి విధివిధానాలు రూపొందించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.