కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గా కల్నల్ భార్య సంతోషి
కల్నల్ సంతోష్‌బాబు సతీమణి సంతోషిని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (గ్రూప్-1 కేడర్)గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జీవో నంబర్ 80 జారీ చేశారు. ఆమె నియామకాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించినట్లు పేర్కొన్నారు. ఆమె 30 రోజుల్లోగా సంబంధిత శాఖ కమిషనర్‌కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ జీవో ప్రకారం సంతోషి వేతనం రూ.40,270 నుంచి 93,780 వరకు ఉంటుందని పేర్కొన్నారు. దీనికి అలవెన్స్‌లు అదనం. అయితే సంతోషి ఒకవేళ వేరే పోస్టును కోరుకుంటే ఆ విషయాన్ని రెండు రోజుల్లోగా తెలియజేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిపింది.













